రాజ్ న్యూస్ ఛైర్మెన్ గా రవిబాబు కు ఊస్టింగ్ ?

రాజ్ న్యూస్ ఛైర్మెన్ గా రవిబాబు కు ఊస్టింగ్

రాజ్ న్యూస్ తెలుగు టేకోవర్ చేసిన బిజెపి నేత నరోత్తం రెడ్డి ఛానల్ మేనేజ్మెంట్ తో కొత్త అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది.
రవిప్రకాష్ చైర్మన్ గా చెన్నైలోని యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ పై బీజేపీ, నరోత్తం రెడ్డిల సీరియస్ అబ్జెక్ష‌న్‌ రైజ్ చేసినట్లు భోగట్టా. పెట్టుబడి పెట్టింది తామైతే, అగ్రిమెంట్లో రవిప్రకాష్ చైర్మన్ గా ఎలా ఉంటాడాని నరోత్తంరెడ్డి సీరియస్సయ్యిండట. కొత్త చైర్మన్ గా తమ తరుపున మరో వ్యక్తితో యాజమాన్యంతో మరో ఒప్పందానికి బీజేపీ నాయకులు రంగం సిద్ధం చేశారు. నేడో రేపో ఈ దిశలో అగ్రిమెంట్ ఖాయం కావచ్చని కమలం పార్టీ లోని కట్టర్ సంఘ్ కార్యకర్తలు చెబుతున్నారు. గతంలో హిందూత్వ వాదులపై రవిప్రకాష్ ఓవర్ యాక్షన్ మీద సంఘ్ సానుభూతిపరులు కోపంగా ఉన్నారు. సందట్లో సడెమియాలా ఎంట్రీ ఇచ్చిన మోజో టీవీ రేవతి మాజీ అనుచరుడు సోము కూడా ఆర్పీ గ్యాంగ్ కి చుక్కలు చూపిస్తునన్నాడని చెబుతున్నారు.
రేవతి, రవిప్రకాష్ జైల్లో ఉండగా సపర్యలు చేసిన తనకు తొలి వెలుగులో, ఇటు రాజ్ న్యూస్ లో అవకాశం ఇవ్వలేదని సోము
కారాలు మిరియాలు నూరుతున్నాడు.

ఎనిమిది నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న తనకు అవకాశం ఇవ్వకపోతే అందరి గుట్టు బయటపెడతానని రవిప్రకాష్ తో సహా అందరికీ సోము హెచ్చరించాడట.” మీ బాగోతాలు అన్నీ నాకు తెలుసు.. ఎవరెవరు ఎన్ని సంపాదించారు.. ఎక్కడ ఎలా దాచారో సాక్షాలతో సహా ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ సోము హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. మరోపక్క
ప్రభుత్వం సన్న బియ్యం కొనట్లేదు అంటూ రఘు మిర్యాలగూడలో చేసిన స్టోరీకి రాజ్ న్యూస్ లోగో పట్టుకొని, తొలి వెలుగుకు క్రెడిట్ ఇవ్వడంపై బీజేపీ నేత రాజ్ న్యూస్ ఇన్వెస్టర్ నరోత్తం రెడ్డి ఫైరయ్యాడని రాజ్ వర్గాలు గుస గుస లాడుతున్నాయి.
” తొలివెలుగు మీకు ముఖ్యమైతే దానికే పని చేయండి, మధ్యలో రాజ్ న్యూస్ ఎందుకు, దాని లోగో ఎందుకు అంటూ రచ్చరచ్చ చేశారట.

Related posts

Leave a Comment