తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!!

  • అనుకున్నాదోకటి, అయ్యిందోకటి..!
  • తన గోతిలో తనే పడ్డ హల్వారాజ్ !!!

అయిపోయింది..అంతా అయిపోయింది… ఏం జరక్కూడదని రవిబాబు అండ్ కో., అనుకున్నారో అదే అయ్యింది.
భయ్యా రాజ్ న్యూస్ కి ఎంట్రీ ఇస్తారని, ఇక మెరుగైన సమాజ స్థాపన పార్ట్ 2 ఖాయమని రవిబాబు అలియాస్ ప్రకాష్ బాబు అభిమానులు కం కార్యకర్తలు ఆ-వే-శించారు. ఇటు ఫ్లవర్ గుర్తు కట్టర్ క్యాడర్ లో ఒక వర్గం కూడా రవిప్రకాష్ వచ్చి తెలంగాణా సీఎం కు చానెల్ ద్వారా చుచ్చు పోయిస్తాడని ఆశలు పెట్టుకున్నారు.

రవన్నను ఛానెల్ కి రమ్మనే నంబర్ కంటే ఆంధ్ర కమ్మ-నిస్ట్ వాసనలున్న ప్రకాశంబాబు రావడం వ్యతిరేకించే వారే సంఘ్ మీడియా వింగ్ లో ఎక్కువని పువ్వు పార్టీ వర్గాలంటున్నాయి. అపశకునాలన్నింటిని దాటి అమావాస్య
అర్ధరాత్రి స్టూడియో చూసుకెళ్లిన రవి ప్రకాశం బాబు…. మెల్లిమెల్లిగా తన ప్లేయర్స్ తో ఫీల్డింగ్ సెట్ చేసాడు.
తన ప్లేయర్స్ లోని నమ్మకమైన అతి-గాడు రఘుతో ప్రాక్టీస్ బులిటెన్స్ చేయించి నిన్న సీరియస్ మ్యాచ్ ఆడించడానికి తనే రంగంలోకి దిగాడు. (మా సారెప్పుడు మ్యాచ్ అడుతాడని అడగొద్దు. పక్కవాళ్ళ భుజాలపై తుపాకులు పెట్టి కాల్చడంలో బాబు ఎక్స్పర్ట్)ఆఫ్టర్ ఏ లాంగ్ టైం తన స్వహస్తాలతో తానే ప్రోమో రాసి, దుబ్బాక హీరో అనే టైటిల్ తో తన అతి నమ్మకమైన ప్లేయర్ రఘుతో దుమ్ముదులిపే పర్ఫార్మెన్స్ ఇప్పిద్దామని ప్లాన్ చేసాడు. గెస్ట్ గా దుబ్బాక బీజేపీ క్యాండిడేట్ రఘునందన్ ను పిలిచి మాంచి పులిహోర బిర్యానీ పండిద్దామని ప్రకాశం బాబు ప్లాన్. అంతలోనే సడెన్ గా ప్రకాశం బాబుకు మేనేజ్మెంట్ నుండి ఓ హార్డ్ వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు.

మా ఛానెల్ లో నిన్ను పెట్టుకోవడమే ఎక్కువైతే … నువ్వు నీకంటే ఎక్స్ట్రా చేసే వాళ్ళని పెట్టుకొని ఎన్నికల్లో చేయి విరిగిందని పెద్ద కట్టేసుకొని ఎక్స్ట్రా చేసినవాడికి దుబ్బాక హీరో అని టైటిల్ పెట్టి హంగామా చేయాలనుకోవడం ఎక్స్ట్రా కాదా అనేసరికి…. రాసిన ప్రోమో మడిచి ఎక్కడో పెట్టేసుకొని రవిబాబు సైలెంటైపోయిండంట. దీంతో రఘునందన్ ను పక్కనపెట్టి దాసోజు శ్రవణ్ తో డిస్కషన్ మమ: అనిపించి పూర్తి చేశారు. వారం రోజులుగా రాజ్ న్యూస్ కేంద్రంగా జరుగుతున్న హిడెన్ ఎపిసోడ్స్ చూసి….. నేను రాజ్ న్యూస్ కు ఎందుకు వచ్చానురా బాబు? మంచో చెడో చేసిన తప్పు ఒప్పుకోని ఆ టీవీ నైన్ లోనే ఉండిపోతే నాకు ఈ కాషాయ ఖర్మ పట్టేది కాదని తన క్లోజ్ సర్కిల్స్ లో ప్రకాశం బాబు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నట్లు రాజ్ వర్గాలు చెబుతున్నాయి.

Views: 18741

Related posts

Leave a Comment