రవిప్రకాష్ కూడా పీకే’స్తాడా..?

రవిప్రకాష్ కూడా పీకే’స్తాడా..?
******************
రాజ్ న్యూస్ లో రీసెంట్ గా లెగ్గుపెట్టిన రవిబాబు ఎలియాస్ రవిప్రకాష్ హిడెన్ ఎజెండా ఏంటి? రవిబాబు క్లోజ్ సర్కిల్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతోంది. తెలంగాణా అండ్ ఆంధ్రా లలో తన మొఖం ఎలాగు చూపించే పరిస్థితి లేదని రవిప్రకాష్ ఓ కంక్లూజన్ కు వచ్చాడంట. తెలుగు రాష్ట్రాల్లో తన మొఖం చెల్లకుండా చేసినోళ్ల
మీద ఎలాగైనా రీవేంజ్ కోసం ఏదో ఒకటి చేసేయ్యలని రవిబాబు బర్నయిపోతున్నడంట. ఏ ఛానలైనా తెలుగు స్టేట్స్ లో తన బోమ్మ చూపిస్తే బాక్సు పగిలిపోద్దాని తెలిసిపోవడంతో మరో రూట్లో టీవీ అప్పియరెన్స్ కోసం ఆర్పీ తహతహలాడుతున్న ట్లు సారు భక్తులు చెబుతున్నారు.
” సారు తోపు ! సారు తురుమ్ ! అన్నిటికిమించి సారు సర్వాంతర్యామి ! ఎక్కడైనా ఉండగలడు…ఏమైనా చేయగలడు…ఎన్నో జీవితాలకు ఆయన జీరో వోల్ట్ బల్బ్..!! ఆర్పీ భక్తజననాట్యమండలి ఉవాచ ఇది. ఈ భక్త జనమండలిని ముందుపెట్టి అండర్ కవర్లో, మార్కెట్లో ధమాలన్న ఛానల్స్ ని టేకోవర్ చేసి వెనకుండి నడపాలని ఆర్పీ సీరియస్ ప్లానింగ్ చేస్తుండంట.ఈ ప్లాన్లో భాగంగానే కామన్ ఎనిమీ, కామన్ ఫ్రెండ్స్ ఎవరని ఫోకస్ పెట్టిండని ఆర్పీ భక్తజనమండలి చెప్పుకుంటోంది. తనకు లాయల్ గా వుండి పనికొచ్చే రకాలని (జర్నలిస్ట్ లని) పిలిపించి మాట్లాడుతున్న రవిబాబు ఎలియాస్ రవి ప్రకాష్, ఈ పనిని గతంలో తన టీమ్ లోఉన్న ఓ అత్యంత న-మ్మక-స్టూడికి అప్పగించి మానిటర్ చేస్తున్నాడని ప్రచారంలో ఉంది. ఈ న-మ్మక-స్తుడు రవి బాబుతో గతంలో అసోసియేటై ఇప్పుడు చోటా మోటా ఛానెల్స్ లో పనిచేసే వారితో ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి చర్చిస్తుండట. ఇది పక్కనపెడితే మరోపక్క తెలుగు స్టేట్స్ లోని జిల్లాల రిపోర్టర్లతో అప్పోజిషన్ పోలిటీషియన్స్ తో నెట్వర్కింగ్ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఆర్పీ ఎలియాస్ రవి బాబు. మూడేళ్ళకు వచ్చే ఎలక్షన్స్ పోల్ స్ట్రాటజీ కి పునాది వేస్తే ఎలావుంటదని లెక్కలేస్తున్నాడు. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (పీకే) కంటే తనకేం తక్కువని సన్నిహితుల దగ్గర ప్రశ్నిస్తున్న ఆర్పీ ఈసారి ఎన్నికల్లో తన తెలంగాణా, ఆంధ్రా లలో తన ఎనిమీలకు వ్యతిరేకంగా ఇప్పటినుంచి పనిచేయాలని రవిబాబు ఎలియాస్ రవి ప్రకాష్ ఆలోచిస్తున్నాడంట.

Related posts

Leave a Comment