రాజ్ న్యూస్ లో రవి భయ్యాని ఉండనిస్తారా ?

రాజ్ న్యూస్ లో రవి భయ్యాని ఉండనిస్తారా ?

రవిబాబు ఎలియాస్ రవిప్రకాష్ చిన్నపట్నుంచి
పెద్ద మనిషి అయ్యేదాంక కమ్యూనిస్ట్ గానే బ్రాండ్ ఇమేజ్.
పుట్టింది, పెరిగింది అంతా అక్కడే.
ఫోర్ ట్వంటీ (420) ముక్కలైన నక్సలైట్ గ్రూపుల్లో ఒకానొక గ్రూప్ స్టుడెంట్ వింగ్ లో తిరిగిన
రవి సారు ఏక్దం భాజాపా భయ్యాల ఛానల్లో చేరడం ఆయన గురించి చిన్నప్పట్నుంచి తెలిసిన కామ్రేడ్స్ కి గట్టి షాకిచ్చింది. మావాడు పిరికోడని తెలుసు బట్, మరీ ఈ స్థాయిలో చవట దద్దమ్మని ఊహించలేదని భయ్యా బాల్య స్నేహితులు, మాజీ కామ్రేడ్ దోస్తులు పొల్ల పోల్ల ఏడుస్తున్నారు. దీనిపై స్పందించిన రవిభయ్యా ఏ పాలిటిక్స్ తో ఉన్నామనేది కాదు బాస్, కామన్ ఎనిమీని ఏరకంగా దెబ్బేసామనేది పాయింటని ప్రవచిస్తున్నడంట.
ప్రవచనకార జర్నలిస్టుగా గొప్ప ఫాలోయింగున్న రవిప్రకాష్ మాత్రం నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జై శ్రీ రామ్ నినాదం తో కలిపి కూడా సాదించొచ్చని ఈ మధ్య కొత్త థియరీ చెబుతున్నాడంట. శ్రీరామ భక్తులతో ఐక్యకూటమి కట్టమని మావో ఏనాడో చెప్పాడని, విప్లవం విజయవంతం చేసే పనిలో గణపతి పూజ తప్పనిసరని రవి
సారు సెలవిస్తుండు. ఈ ఫిలాసఫీ అర్థంకాక యేడాదిన్నర స్క్రీన్ అప్పియరెన్స్ మిస్సై సారుకేమన్న సర్క్యూట్ దొబ్బిందా అనే డౌట్ ఆయన ఫాలోవర్స్ కొందరు ఎక్స్ప్రెస్ చేస్తుడ్రు. ఇదిలా ఉంటే ఓ కమ్యూనిస్టుని మన ఛానల్ హెడ్ గా ఎలా పెడతారని కట్టర్ హిందూత్వ సంఘ్ నాయకులు భాజాపా లీడర్స్ ని ప్రశ్నిస్తున్నారట. నేను కమ్యూనిస్టు కాదు, నేను నక్సలైట్ కాదు, నేను మారిపోయా మొర్రో!! అని ఆర్పీ ఎంత మొత్తుకున్నా కట్టర్ సంఘ్ మేధావులు రవి ప్రకాష్ ను నమ్మడం లేదంట. ఈ పరిణామాల తో రవి ప్రకాష్ రాజ్ కు వస్తే ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు ఆయన అనుయాయుల పరేషాన్ లో పడ్డారు. బాస్ మళ్ళి తెరపైకి వస్తే తమకి చిన్నా, పెద్ద ఛాన్స్ లు వుండొచ్చని ఆశపడ్డ జర్నలిస్టులు ఇప్పుడు సీన్ మారేసరికి టెన్షన్ పడుతున్నారు.

Related posts

Leave a Comment