రాజ్ కు పోదాం, రాజ్యం చేద్దాం ఛలో ఛలో…!

రాజ్ కు పోదాం,

రాజ్యం చేద్దాం ఛలో ఛలో…!

******************

రెండు రోజుల క్రితం రాజ్ న్యూస్ లో ప్రత్యక్షమైన తమ మాజీ బాసు రవి బాబు ఎలియాస్ రవి ప్రకాష్ పంచన చేరేందుకు కొందరు టీవీ9- అసమదీయులు తెగ ఆరాటపడుతున్నారు. ఓ సీనియర్ మోస్ట్ ఫిమేల్ యాంకర్ ఈ టీమ్ ను లీడ్ చేస్తున్నట్లు సమాచారం. మల్లగుల్లాలు పడుతున్న ఈ ఫీమేల్ యాంకర్ అంతా సెట్ అయితే జంపింగ్ కి “రవిసార్ తో మాట్లాడుకున్నట్లు” బాహాటంగానే చెబుతొంది. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లుగా ఈ మేడం చుట్టూ టీవీ9 అసైన్మెంట్, ఇన్పుట్, అవుట్పుట్, రిపోర్టింగ్ లోని అసమదీయులు ఒకరిద్దరితో జంపింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. టీవీ9లో ప్రస్తుతమున్న లక్షల్లో జీతం సారు ఇస్తారా? అని సా…గుతున్న మీమాంసతో మేడం ఎటూతేల్చుకోలేకపోతున్నారని సోర్స్. రాజ్ ఎంతకాలం ఉంటుంది, సారూ ఎంతకాలం ఉంటారనే విషయం మీద క్లోజ్ సర్కిల్స్ లో ఈ ఈ యాంకర్ గారు గుస గుస లాడారు.

మరో పక్క ఇటీవల బ్యాక్ స్టాబింగ్ బయటపడి రివర్షన్లో రిపోర్టరై మొహం చాటేసుకు తిరుగుతున్న ఒకానొక బ్యూరోచీప్, రవి సారు దగ్గర ట్రై చేస్తే ఎలా ఉంటుందని తన పార్ట్నర్ ని ఆడగడం..

“ముందు ఆయన నిన్ను నమ్మాలి, సెకెండ్ పాయింట్

నువ్వక్కడికి రవిగారిని చూసి వెళ్ళద్దు, నీకు తెలుసుగా ఆయన కమ్యూనిస్టు.

అదేమో బీజేపీ ఛానల్… వాళ్ళు నాకు తెల్సు! ఆయనను ఎక్కువ కాలం ఉంచుకోరు కాలు జారద్దు” అన్నట్లు సమాచారం. అవుట్పుట్ లో కూడా ఇద్దరు దాదాపుగా తట్టా బుట్ట సర్డుకుని రవిబాబు దగ్గర రాజ్ లో చేరేందుకు వెలుగు లో చేరిన తమ మాజీ హెచ్ఓడీ ని రెగ్గులర్ ఫాలోఅప్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ కొసమెరుపు

కామిడి ఏంటంటే…వీళ్ళెవ్వరినీ రాజ్ కి తీసుకోడానికి రవి బాబు ఎలియాస్ రవి ప్రకాష్ సిద్ధంగా లేడు. మొదటి కారణం టీవీ9 లో ఇచ్చినట్లు తన సొంత ప్రాజెక్టులో అనామకులకు అడ్డగోలు జీతాలు ఇవ్వకూడదని, తన మనుషులు కొందరు టీవీ9 లోనే ఉండాలని ఫీలవ్వడం. రవిప్రకాష్ & బ్యాక్ స్టాబర్స్ బ్యాచ్ పై క్లారిటీ తో ఉన్న టీవీ9 లీడర్షిప్ ఎగ్రిసివ్ నిర్ణయాలతో రవిబాబు ఎలియాస్ రవి ప్రకాష్

చీప్ ట్రిక్స్ ని గమనిస్తున్నారు.

Related posts

Leave a Comment