ఢిల్లీ వెళ్లనున్న జనసేన అధినేత పవన్‌

అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను జనసేనాని కలవనున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.బీజేపీ పెద్దల భేటీలో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై నిశితంగా చర్చించనున్నారు. సీట్ల పంపకాలు, ఎవర్ని ఎక్కడ్నుంచి పోటీ చేయించాలి..? అనే విషయాలపై ఇవాళ సాయంత్రం లోపు ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది.

Related posts

Leave a Comment