వైసీపీలో రాజ్యసభ రేసు.. జగన్ ఫార్ములా ఇదే

 స్పెషల్ స్టోరీ….

న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్….  వైసీపీలో రాజ్యసభ ఫీవర్‌ పీక్‌ స్టేజీకి చేరింది. ఒక్కచాన్స్‌ కోసం నేతలు తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు. తమ సీటు కన్‌ఫర్మ్ కోసం జగన్‌కు రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. అయితే వైసీపీ నుంచి పెద్దల సభకు వెళ్లే నేతలెవరు? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఏపీలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. నామినేషన్ల దాఖలుకు టైమ్‌ దగ్గర పడుతోంది. దీంతో ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది. తమకు సీటు వస్తుందా? రాదా? అని పొలిటికల్‌ లెక్కలు వేసుకుంటున్నారు. లాస్ట్‌ మినిట్‌లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అని ఆరా తీస్తున్నారు.

వైసీపీకి నాలుగు రాజ్యసభ సీట్లు దక్కబోతున్నాయి. ఇందులో ఒక సీటు బీజేపీ క్యాండేట్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మొన్ననే ముకేష్‌ అంబానీ వచ్చి వెళ్లారు. తమ క్యాండేట్‌కు సీటు ఇవ్వాలని కోరారు. అంబానీ కోరిన వ్యక్తికి ఇచ్చినా.. బీజేపీ కోరిన వారికి ఇచ్చినా.. ఇక మిగిలేది మూడు సీట్లే. ఈ మూడు సీట్ల కోసం ఇప్పుడు పార్టీలో జోరుగా లాబీయింగ్‌ నడుస్తోంది.

మొన్నటి వరకూ ఈ మూడు సీట్లలో ఓ సీటు మెగాస్టార్‌ చిరంజీవికి ఇస్తారని ఓ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఒత్తిడి నేపథ్యంలో ఆయనకు ఇచ్చేది లేదని వైసీపీ నేతలు చెప్పారట. ఇప్పుడు తీవ్రమైన పోటీ నేపథ్యంలో సీటు ఇవ్వలేమని క్లారిటీ ఇచ్చారట. సీటు రాదని తెలిసిన తర్వాత నాగబాబు మీడియాకు క్లారిటీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి రాజ్యసభ ఇస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అలాంటి వార్తలను నమ్మొద్దని నాగబాబు అన్నారు. ప్రస్తుతం చిరంజీవికి జనసేన సహా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేశారు. నాగాబాబు ప్రకటనతో మొత్తానికి మూడు సీట్ల రేసులో చిరంజీవి లేరన్న క్లారిటీ వచ్చేసింది.

ఇప్పటికే మూడు సీట్ల కోసం వైసీపీలో రేస్‌ నడుస్తోంది. ఇప్పటికే రాజ్యసభ రేసులో వ్యాపారవేత్త అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్‌రావు. మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డికి, బీదకు టిక్కెట్లు కన్‌ఫర్మ్ అయ్యాయని చెప్పుకుంటున్నారు. ఇక పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవిల్లో ఒకరిని రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది.

మొత్తానికి ఆ మూడు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతాయో అనే టెన్షన్‌ నేతల్లో ఉంది. లాస్ట్‌ మినిట్‌లో సమీకరణాలు మారితే…తమ చాన్స్‌ పోతుందో అనే భయం ఉంది. దీంతో జగన్‌ ఏం నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠగా నేతలు ఎదురుచూస్తున్నారు.

Related posts

Leave a Comment