జగన్ ను ముఖేష్ కలవడానికి అసలైన కారణాన్ని….అప్పుడే బయట పెట్టిన….”న్యూస్ ఇండియా24/7 నేషనల్ తెలుగు న్యూస్ నెట్వర్క్”

ఇటీవల ఏపీ సీఎం జగన్ ను రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వయంగా ఇంటికి వచ్చి కలిసిన సంగతి తెలిసిందే . వారి మధ్య ఏం చర్చలు జరిగాయన్నది రహస్యంగానే ఉంది . దీనిపై అనేక ఊహాగానాలు ఉన్నాయి . ఈ విషయంపై భేటీ జరిగినే రోజేన“న్యూస్ ఇండియా24/7 నేషనల్ తెలుగు న్యూస్ నెట్వర్క్”అసలు గుట్టు బయటపెట్టింది . ఇంతకీ జగన్ ను ముఖేష్ కలవడానికి అసలైన కారణం ఏంటో తెలుసా అంటూ అసలు విషయం చెప్పేసింది .పరిమళ్ నత్వానీ అనే ఎంపీకి రాజ్యసభ సీటు కోసం ముఖేష్ జగన్ వద్దకు వచ్చారని తెలిపింది . ఈ నత్వానీ ఏపీ కోటాలో త్వరలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశం ఉందని చెప్పింది . ఇంతకీ ఈ నత్వానీ ఎవరో తెలుసా అంటూ అతని వివరాలు బయటపెట్టింది . ఈ నత్వానీ మొదట్లో వ్యాపారి … 1997 లో రిలయెన్స్‌లో జాయినయ్యాడు .. రిలయెన్స్ వ్యాపార విస్తరణలో ఇతనిది కీలక పాత్ర . ధీరూభాయ్ అంబానీకి ఈ నత్వానీ సన్నిహితుడు . రిలయెన్స్ టెలికాం , పెట్రో కీలక ప్రాజెక్టుల అభివృద్ధిలో నత్వానీ వ్యూహం ఉంది .

ఈ నత్వానీ బీజేపీకి సన్నిహితుడు . 2008 లో జార్ఖండ్ నుంచి తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యాడు .. తర్వాత 2014 లోనూ బీజేపీ ఎంపీ అయ్యాడు . ఇప్పుడు మరోసారి ఎంపీ ఛాన్స్ కోసం ఏపీ వైపు చూస్తున్నాడు . ఈ విషయం కోసమే ఏకంగా ముఖేశ్ అంబానీ నేరుగా జగన్ వద్దకు వచ్చినట్టు తెలుస్తోందని” న్యూస్ ఇండియా” విశ్లేషించింది . ఇప్పుడు “న్యూస్ ఇండియా”  చెప్పిందే నిజమైంది ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కోరామని ఝార్ఖండ్‌ స్వతంత్ర ఎంపీ పరిమల్‌ నత్వానీ అంగీకరించారు . సోమవారం పార్లమెంటు సెంట్రల్‌ హాలులో విలేకరులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు . ప్రస్తుతం ఝార్ఖండ్‌ నుంచి కాంగ్రెస్‌ , బీజేపీకు ఒక్కో సీటు వస్తున్న నేపథ్యంలో అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం లేదని .. అందుకే ముకేశ్‌ అంబానీతో అమరావతి వచ్చి జగన్‌ను కలిసినప్పుడు ఈ ప్రతిపాదన చేశానని నత్వానీ చెప్పారు .

Related posts

Leave a Comment