అంగన్ వాడీలకు ….దసరా గిఫ్ట్

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ ….  అంగన్ వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండగ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 83 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రతి నెల మాసాంతంలో వేతనాలు అందుతున్నాయి. అయితే అకోబ్టర్ లో దసరా పండగ మొదటి వారంలోనే రావడంతో వేతనాలు లేకపోవడం వల్ల పండగకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని తెలంగాణ అంగన్ వాడీ సంఘం నేతలు మంగళవారం(అక్టోబర్ 1, 2019) మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి వేతనాలు ఇప్పించాలని కోరారు.

అంగన్ వాడీల విజ్ణప్తిని మంత్రి సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. వెంటనే స్పందించిన సిఎం ఉద్యోగులకు వేతనాల కోసం నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. దీంతో మంగళవారం రాత్రి అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల నిమిత్తం 83 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అంగన్ వాడీ ఉద్యోగులకు వేతనాలు అందనున్నాయి.

అడిగిన వెంటనే అంగన్ వాడీ ఉద్యోగుల వేతనాల కోసం నిధులు విడుదల చేయడంపై గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మొదటినుంచి సీఎం కేసిఆర్ అంగన్ వాడీ ఉద్యోగులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్ వాడీ ఉద్యోగులకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణనే అని అన్నారు.

Related posts

Leave a Comment