రండి, కలిసిపోరాడదాం… రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్….

  • నల్లమలలో యురేనియం తవ్వకాలు
  • వ్యతిరేకిస్తున్న పవన్ కల్యాణ్
  • ఈ నెల 16న అఖిలపక్ష సమావేశం

జనసేనాని పవన్ కల్యాణ్ నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై అఖిలపక్షం ఏర్పాటుకు నడుంబిగించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న అఖిలపక్షం నిర్వహిస్తున్న సందర్భంగా పవన్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలను నిరసిస్తూ కలిసి పోరాడదామని పవన్ ప్రతిపాదించారు. అంతేకాకుండా, అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పవన్ ఫోన్ కాల్ కు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Related posts

Leave a Comment