ప్రజా సేవకు జనసైనికులు పిలుపు…

 THE NEWS INDIA 24/7 NATIONAL NEWS NETWORK….ఫ్లాష్/ఫ్లాష్…..   తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణ 216 వెంబడి హైవే రోడ్డు నందుగల గుంతలు పూడ్చివేత కు పట్టణానికి చెందిన మహిపాల్ వీధి జనసైనికులు పిలుపునిచ్చారు.  గత పది సంవత్సరాల నుంచి, అమలాపురం మున్సిపాలిటీకి, రోడ్డు భవనాల శాఖ వారికి, విన్నపాలు విన్నవించుకొన్న… పట్టించుకునే నాధుడే లేక పోయారని, స్వయంగా రంగంలో దిగారు జనసైనికులు, దానిలో భాగంగా ఆదివారం నాడు గుంతల  పూడ్చివేత కు  పిలుపునిచ్చారు  జనసైనికులు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవించాయని, ప్రమాదాలకు గురై చనిపోయిన సందర్భాలు ఉన్నాయని, జన సైనికులకు గుర్తు చేశారు. ప్రజల శ్రేయస్సు ప్రజా అవసరాలు తీర్చడంలో జనసైనికులు ముందు ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related posts

Leave a Comment