ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు…?

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…..ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది జనవరి 26న కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే విషయం ప్రభుత్వ వర్గాల నుంచి లీకైన సంగతి తెలిసిందే.. ఏపీ సీఎం జగన్ ఈ మేరకు గవర్నర్ వద్ద దీన్ని ప్రస్తావించడంతో విషయం వెలుగుచూసింది. ఇప్పుడు ఆ కొత్త జిల్లాలు ఏవీ అనే చర్చ ప్రభుత్వవర్గాల్లో సాగుతోంది.

ఇప్పటికే దీనిపై అధికారులు పూర్తి కసరత్తు చేసి జగన్ కు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. కొత్త జిల్లాల రూపకల్పన పరిధి జనాభా నిష్ఫత్తి రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొని మొత్తం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారని  సమాచారం.

కొత్త జిల్లాల కోసం ముందుగా డివిజన్లు – మండలాలు – గ్రామాల సరిహద్దులను వేరు చేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజన చేస్తున్నట్టు తెలిసింది. జగన్ ఇచ్చిన ‘పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా’ జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఏపీలో ఏర్పాటు చేసే కొత్త జిల్లాలు ఇవే..

1. తిరుపతి
2. హిందూపురం
3.రాజంపేట
4. నంద్యాల
5. బాపట్ల
6. నరసారావుపేట
7. విజయవాడ
8. నరసాపురం
9. రాజమండ్రి
10.అమలాపురం
11.అరకు
12. అనకాపల్లి..

ఈ 12 కొత్త జిల్లాలతోపాటు ప్రస్తుత 13 ఏపీ జిల్లాలు కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు 25 జిల్లాల ఏపీ కోసం అధికారులు ప్రతిపాదన రూపొందించినట్టు తెలిసింది.

Related posts

Leave a Comment