నీ దృష్టిలో నిరుపేదలు వీరేనా…. చంద్రబాబు ను ఉతికారేసిన “విజయసాయిరెడ్డి”

  న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలిందని ఆయన అన్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనే రచ్చ చేయడం ద్వారా… రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా దొంగల ముఠా కుట్రలు మొదలుపెట్టిందని మండిపడ్డారు. యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. పల్నాడులో ప్రశాంతత నెలకొనడం చంద్రబాబుకు ఇష్టం లేదనే విషయం అర్థమవుతోందని చెప్పారు. పేదల జోలికి వస్తే ఊరుకోనని చంద్రబాబు చెబుతున్నారని… ఆయన దృష్టిలో కోడెల శివప్రసాద్, యరపతినేని, చింతమనేని ప్రభాకర్, నారాయణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, సుజనా చౌదరిలే నిరుపేదలని ఎద్దేవా చేశారు.

Related posts

Leave a Comment