ఏపీ తహసీల్దార్ల సంఘం ఆవిర్భావం

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్... ఏపీ తహసీల్దార్ల సంఘం(ఏపీటీఏ) ఆవిర్భావ మైంది. తమ సమస్యలపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌(ఏపీఆర్‌ఎ్‌సఏ) సరైన కృషి చేయకపోవడంతో స్వతంత్ర సంఘం వైపుగా రాష్ట్రంలోని తహసీల్దార్లు అడుగులు వేశారు. మంగళవారం విజయవాడలోని ఒక హోటల్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన తహసీల్దార్లు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 100కు పైగా తహసీల్దార్లు హాజరయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీలు చేసినా.. ఇప్పటికీ సొంత జిల్లాలకు పంపించకపోవటం, ఎన్నికల బడ్జెట్‌ మంజూరు కాకపోవడం వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా 20 మంది తహసీల్దార్లతో అడ్‌హక్‌ కమిటీని వేశారు.

Related posts

Leave a Comment