విద్యుత్ కొనుగోళ్లలో…భారీ అవకతవకలపై కమిటీ …

 


న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…అమరావతి: గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలపై వైసీపీ సర్కార్ ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో సోలార్, పవర్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. దీంతో ట్రాన్స్‌కో సీఎండీ కన్వీనర్‌గా 9 మందితో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు బుగ్గన, బాలినేని, అడ్వకేట్ జనరల్, అజయ్ కల్లం, రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఉన్నారు. ఈ కమిటీ గత ప్రభుత్వంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన సోలార్, విండ్ పవర్ ధరలు రివ్యూ చేయనుంది. డిస్కంలకు తక్కువ ధరలకు అమ్మేవారితో సంప్రదింపులు చేయనుంది. గతంలో ఉన్న ధరలు, ప్రస్తుత ధరలను కమిటీ సమీక్ష చేయనుంది.

Related posts

Leave a Comment