బంగాళాఖాతంలో అల్పపీడనం భారీ వర్షాలు

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…విశాపట్నం: ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారంలోపు ఇది మరింత బలపడి క్రమంగా వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు. వీటి ఫలితంగా కోస్తా జిల్లాలో సోమ, మంగళవారాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలుపడే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న 4 రోజుల్లో కొన్నిచోట్ల తేలికపాటి, మోస్తరు వర్షాలు కురవచ్చన్నారు. అంతేకాక దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మరొక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వివరించారు.

Related posts

Leave a Comment