ఫీల్డ్‌ అసిస్టెంట్ల తొలగింపునకు రంగం సిద్ధం!

     న్యూస్ ఇండియా    24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్...వైసిపి ప్రభుత్వ పాలనలో కక్షసాధింపులకు అవకాశం లేదని, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికి సంక్షేమం, అభివృద్ధే తమ విధానమంటూ వైసిపి నాయకులు చెప్పిన విషయం తెలిసిందే. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా కాకముందే కక్షసాధింపులకు తెరదీస్తుండడం గమనార్హం. గత తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకానికి సంబంధించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించేందుకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాయాలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఇజిఎస్‌కు సంబంధించి ఫీల్డ్‌అసిస్టెంట్లను తొలగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఫీల్డ్‌ అసిస్టెంట్ల్‌, సీనియర్‌మేట్లు, జూనియర్‌ మేట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఒకొక్క ఫీల్డ్‌అసిస్డెంట్‌కు రూ.9వేలు, సీనియర్‌మేట్లలకు రూ.8వేలు, జూనియర్‌మేట్లకు రూ6,500 వరకు గౌరవ వేతనం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో పనిచేస్తున్న ఫీల్డ్‌అసిస్టెంట్లంతా టిడిపికి చెందిన వారేనని కారణంతో తొలగిస్తున్నట్లు సమాచారం.
642మంది ఉపాధికి గండి
జిల్లావ్యాప్తంగా 48 మండలాల్లో ఎంఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో సుమారు 642 మంది వరకు ఫీల్డ్‌అసిస్టెంట్లగా, సీనియర్‌ మేట్ల్‌గా, జూనియర్‌ మేట్లుగా పనులు చేస్తున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. వీరిని తొలగిస్తూ వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో 642 మంది నిరుపేదలు తమ ఉపాధిని కోల్పోనున్నారు.
తొలగింపుపై సర్వత్ర విమర్శలు
వైసిపి ప్రభుత్వ పాలనలో ఆపార్టీకి చెందిన అర్హులైన వారికి ఉపాధి చూపించడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని తొలగించి, వారిస్థానాల్లో వైసిపికి చెందిన వారిని నియమించడం ఎంతవరకు సమంజసం అన్నదే అందరూ చర్చించు కుంటున్నారు. ఒకవేళ వీరు అవినీతి అక్రమాలలకు పాల్పడినట్టుగా నిర్దారణ అయితే సంబంధింతులపై చర్యలు తీసుకోవచ్చు. టిడిపి పాలనలో పనిచేశారన్న అభిప్రాయంతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈనెల 24వ తేదీన 13జిల్లాల కలెక్టర్లతో జరిగిన సదస్సులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల వరకే రాజకీయాలు అంటూ ప్రకటించారు. అంతేకాక ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారు కూడా తమ వారే అన్న ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా అభివృద్ది, సంక్షేమ ఫలలాలు అర్హులందరికి అందాలంటూ జారీ చేశారు. అయితే సిఎం కలెక్టర్ల సదస్సులో ఉత్తర్వులు జారీ చేసి 24 గంటలు కూడా గడవక ముందే వైసిపి ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తునట్లు తెలిసింది.

Related posts

Leave a Comment