జగన్ తొలి ప్రాధాన్యం ఏపీకి ప్రత్యేక హోదా ..

అందుకు ఓకే అంటేనే బీజేపీ ఆఫర్ స్వీకరించేది అని తేల్చేసిన జగన్ ఏపీ ప్రజల స్వప్నంఏపీకి ప్రత్యేక హోదా .. ఇక జగన్ బీజేపీతో సఖ్యంగా ఉండాలనుకున్నా ప్రత్యేక హోదా ఇస్తేనే అది సాధ్యం. అలాగని జగన్ కు ఎన్డీయేతో గత ప్రభుత్వంలా ఘర్షణకు దిగే ఆలోచన లేదు. కానీ ఎలాగైనా ప్రతేక హోదా సాధించే లక్ష్యంతో ఉన్న జగన్ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామన్నా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి జగన్ ఆ పదవి తీసుకోటానికి నిరాకరించారు. ప్రతేక హోదా ఇస్తామని చెప్తే బీజేపీ ఆఫర్ తీసుకోటానికి అభ్యంతరం లేదని చెప్పారు.

కేవలం సంకేతాలు పంపామని ఆఫర్ చెయ్యలేదంటున్న బీజేపీ ..

ఆఫర్ కు నో అంటున్న వైసీపీ ఇక తాము వైసిపి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తామని స్పష్టంగా చెప్పలేదని, సంకేతాలు మాత్రమే ఇచ్చామని, వైసిపి ఆసక్తి ఉంటే ఆ పదవి ఇస్తామనే సంకేతాలను పంపించామని బిజెపి నాయకులు అంటున్నారు. ఇక ప్రత్యేక హోదా మాత్రమే తమ ప్రథమ ప్రాధాన్యమని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్డీఎ ప్రభుత్వం ఇచ్చే పదవులను తీసుకోవడానికి తాము సిద్దంగా లేమని వైసిపి నాయకులు అంటున్నారు. ఇక వైసిపికి లోకసభలో 22 మంది సభ్యులు ఉన్నారు . ఇక ఆ పార్టీ లోకసభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించింది. వైసిపి డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడానికి ఆసక్తి ప్రదర్శించకపోవడంతో ఆ పదవిని జెడియు కి ఇవ్వాలనే ఆలోచనలో బిజెపి ఉంది. అయితే, ఆ పదవిని ప్రస్తుతం శివసేన ఆశిస్తోంది.

Related posts

Leave a Comment