జగన్ కు బీజేపీ ఆఫర్ .. డిప్యూటీ స్పీకర్ పదవికి నో చెప్పిన జగన్

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ … ఒక పక్క రాష్ట్ర ప్రజల డిమాండ్ అయిన ప్రత్యేక హోదా సాధన కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో కూడా జగన్ ప్రత్యేక హోదా డిమాండ్ ను గట్టిగా వినిపించారు . ఇక ఈ నేపధ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకోవడం వల్ల రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎకు ఆ పదవి తీసుకోవడం వల్ల దగ్గరైనట్లు సంకేతాలు వెళ్తాయని, ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో దగ్గర అయితే దానివల్ల తనకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

Leave a Comment