లీడర్లైనా, అధికారులైనా లెక్కలు తీసుడే.. ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఎమ్మెల్యే ఆళ్ల

   న్యూస్ ఇండియా 24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్ ... గుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పని మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుడు లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు. ఆదివారం నాడు జరిగిన జడ్పీ సమావేశంలో పాల్గొన్న ఆళ్ల పలు అంశాలు ప్రస్తావించారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలపై విజలెన్స్ విచారణకు అదేశించాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వచ్చాయి? ఎంత ఖర్చు చేశారు అనే లెక్కలు తేల్చాల్సి ఉందని డిమాండ్ చేశారు. అధికారులు బాగా పనిచేస్తే సన్మానం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

Related posts

Leave a Comment