కేంద్రమంత్రిగా అమిత్‌ షా ప్రమాణం..

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అమిత్‌ షా కేంద్రమంత్రివర్గంలోకి వస్తారా? లేదా? అనే విషయంపై పలు రకాల ఊహాగానాలు షికారు చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ వార్తలకు తెరపడింది. కేంద్రమంత్రిగా అమిత్‌ షా ప్రమాణం చేయడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేది తేలాల్సి ఉంది. నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదట రాజ్‌నాథ్‌ సింగ్‌ కేంద్రమంత్రిగా ప్రమాణం చేయగా, ఆ తర్వాత వరుసగా అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలాసీతారామన్‌ కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరి చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

Related posts

Leave a Comment