న‌రేంద్ర దామోదర్ దాస్ మోడీ అనే నేను..

న్యూఢిల్లీ: ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోడీ గురువారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. గురువారం సాయంత్రం దేశ రాజ‌ధానిలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఆవ‌ర‌ణ‌లో క‌న్నుల పండువ‌గా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మోడీ ప్ర‌ధాన‌మంత్రిగా వ‌రుస‌గా రెండోసారి ప్ర‌మాణం చేశారు. దైవసాక్షిగా ఆయ‌న ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు రామ్‌నాథ్ కోవింద్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌, యూపీఏ ఛైర్‌ప‌ర్స‌న్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ కురువృద్ధుడు, లాల్‌కృష్ణ అద్వానీ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ప‌లువురు కేంద్ర మాజీ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment