పశ్చిమ బెంగాల్ లో చంద్రబాబు ప్రచారం..

  • తృణమూల్ కు మద్దతుగా చంద్రబాబు ప్రచారం
  • మమతా బెనర్జీతో కలిసి సభలకు హాజరు!
  • మిత్రధర్మంలో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ప్రచారం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మిత్రధర్మంలో భాగంగా పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతుగా ఆయన రేపు, ఎల్లుండి బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో ప్రచార సభల్లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం జార్గాం, హల్దియా పట్టణాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. ఎల్లుండి గురువారం ఆయన కోల్ కతా, ఖరగ్ పూర్ నగరాల్లో ప్రచార సభలకు హాజరవుతారు. చంద్రబాబుతో పాటు ఈ సభలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతారని తెలుస్తోంది.

ఇప్పటికే చంద్రబాబునాయుడు కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కోసం ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో తెలుగువాళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఆయన తన ప్రసంగాలు అధికశాతం తెలుగులోనే సాగించారు. మరి పశ్చిమ బెంగాల్ లో ఏ భాషలో ప్రసంగిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Related posts

Leave a Comment