ఈదురుగాలులకు కూలిన చెట్టు త్రుటిలో తప్పిన ప్రమాదం ఇద్ద రు, పిల్లలు క్షేమం…!!

బూసిగూడెంలో ఓ ఇంటిపై కూలిపోయిన చింతచెట్టు

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం…

అంధకారంలోబూసిగూడెం…

రోడ్లు భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యం…

అందుబాటులో లేని విఆర్వో…

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్… రంపచోడవరం మండలంలో  మంగళవారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బూసిగూడెంలో మంగళవారం మధ్యాహ్నం వీచిన ఈదురు గాలులకు దొడ్డి చిన్న ,వలుగుల లక్ష్మికు చెందిన తాటియాకు,రేకుల ఇంటిపై ఓ చింతచెట్టు కూలిపోయింది. దాంతో ఇల్లు ధ్వంసమైంది. లోపలున్నవలుగుల లక్ష్మి తో పాటు, అమె ఇద్దరు పిల్లలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వారు పెంచుకుంటున్న అరటి చెట్లు నేలమట్టమయ్యాయి. ప్రభుత్వం స్పందించి, తమను ఆదుకోవాలని, ఇంటిని పునర్నిర్మించడానికి తగిన సహాయం చేయాలని వారు కోరుతున్నారు.

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్ తో గ్రామస్తులు…

 గ్రామస్తులు రెవెన్యూ అధికారులు కలిస్తే ఇది మా పరిధిలో లేదు అని తప్పించుకున్న వైనాన్ని చూస్తుంటే అమాయక గిరిజనుల పై అధికారులకు.. పరాకాష్ట గా కనపడుతుందని గ్రామస్తులు వాపోయారు.
బూసిగూడెం గ్రామం నుంచి మరెన్నో  గ్రామాలకు రహదారి మూసుకుపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు,.. అష్టకష్టాలు పడ్డ దృశ్యలు కనబడ్డాయి.
రంపచోడవరం: ఈదురుగాలులకు రంపచోడవరంలో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోయి తీగలు తెగిపోయాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

Related posts

Leave a Comment