జనంలేక వెలవెలబోయిన రాజ్ నాథ్ సభ…

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్

  • కృష్ణా జిల్లా అవనిగడ్డలో బీజేపీ సభ
  • హాజరయ్యేందుకు విముఖత చూపిన స్థానికులు
  • టీడీపీపై విమర్శలు చేసిన కేంద్ర హోం మంత్రి

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో కాలుమోపారు. అయితే, బీజేపీ అధినాయకత్వంలో నంబర్.3 గా వెలుగొందుతున్న రాజ్ నాథ్ కు అవనిగడ్డలో నిరాశ తప్పలేదు. ఆయన సభ జనంలేక వెలవెల పోయింది. టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో బీజేపీ అగ్రనేత చెప్పే మాటలు వినడానికి ఎవరూ ఆసక్తిచూపించలేదు. అయితే, తన సభలో ఆద్యంతం టీడీపీపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు రాజ్ నాథ్ సింగ్. ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజల కళ్లల్లో మట్టికొట్టిందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఆయన తెలంగాణలోని నిజామాబాద్ సభలో పాల్గొన్నారు.

Related posts

Leave a Comment