ధనసేన ఎలా అయ్యింది?

న్యూస్ ఇండియా 24 /7 నేషనల్ న్యూస్ నెట్వర్క్…ఊ…… అంటే నా దగ్గర పైసల్లేవ్.. నేను అందరిలా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు అని ఉపన్యాసాలు ఇచ్చే జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. డబ్బులే లేనిది అమరావతిలో రెండెకరాల్లో అంత పెద్ద ఇల్లు ఎలా కట్టావు? పైసలే లేనిది పార్టీని ఎలా నడుపుతున్నావు? అంటూ నిలదీస్తున్నారు. పూట కూడా గడవనంత పేదరికం అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చే పవన్ ప్రచారం అంత ఆర్భాటంగా ఎలా చేస్తున్నారు? విమానాల్లో ఎలా ప్రయాణిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎలక్షన్స్ సమయంలోనే కొందరు హల్‌చల్ చేసి.. సమాజోద్ధారక ప్రసంగాలు ఇస్తుంటారనీ.. పవన్ కూడా ఈ కోవకు చెందినవాడే అంటూ తమ అభిప్రాయాలను సోషల్‌మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ప్రయాణ ఖర్చులు కూడా లేని పేదవారుండే జనసేన.. ఆకాశంలో విహరించే సౌకర్యాలు గల ధనసేనగా ఎలా మారిందని అంటున్నారు!

Related posts

Leave a Comment