పచ్చ మీడియా పతివ్రతలు…!!

న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్...పచ్చ మీడియాకు ఇపుడు హఠాత్తుగా ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చింది. పార్టీ ఫిరాయింపులు గుర్తుకువచ్చాయి. ప్రజాస్వా మ్య విలువలు కూడా గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల చట్టం వెలవెలపోతున్నదట. పార్టీ మార్పిడి నిరోధించడానికి గట్టి చట్టం రావాలట. ఇంకా చాలా చాలా రాసుకున్నా రు తమ పత్రికల్లో. సరే వారి పత్రిక వారిష్టం. ఎంతైనా రాసుకోవచ్చు. కానీ ఈ నీతులు రెండువందలకు పైగా సీట్లతో గెలిచిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో బాబు గద్దె దింపినపుడు ఎందుకు గుర్తుకు రాలేదనేది ప్రశ్న. అంతకు ముందు నాదెండ్ల ఎపిసోడ్‌ను వెన్నుపోటని..అన్యాయం సహించం అంతు తేలుస్తామని పతాక శీర్షికలతో రంకెలు వేసిన సదరు ప్రజాస్వామ్య ఉద్ధారకుడు.. బాబు కుట్ర సమయంలో ఎందుకు మౌనవ్రతం అవలంబించాడో చెప్పాలి. వాస్తవానికి అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ముఖం చూసి రెండువందలకు పైగా అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. చంద్రబాబూ నువ్వు సీఎం పదవి చేపట్టు. మమ్మ ల్ని ఉద్ధరించు అని ఒక్కరంటే ఒక్కరు ఓటు వేయలేదు. అయినా ఆనా డు ఎన్టీఆర్‌ను దింపేసీ బాబు గద్దెనెక్కినపుడు ఈ పతివ్రతకు ప్రజాస్వా మ్యం ఎందుకు గుర్తుకురాలేదో తెలియదు. 2014 ఎన్నికలు జరిగీ జరగ్గానే ఏపీలో వైసీపీ ఎంపీని బాబు తన పార్టీలో చేర్చుకున్నపుడు, ఆ తర్వాత వైసీపీ నుంచి క్యూ కట్టించి మరీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నపుడు ప్రజాస్వామ్యం కంటే ముందు జగన్‌పార్టీ బలహీనపడిపోవడమే ముఖ్యమనిపించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ టీఆర్‌ఎస్ ఎంపీని ఎమ్మెల్సీలనుచేర్చుకున్నది? అపుడు ఈ పతివ్రతలు ఎక్కడికి పోయారో? వైఎస్ హయాం లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాగేసినపుడు అది ప్రజాస్వామ్య హననమంటూ బాధ పడకుండా.. తెలంగాణ ఉద్యమం కనుమరుగవుతున్నదని సంబురపడ్డారు.

కొంతకాలం కిందటి మాట. సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే ఫొటో ఒకటి పెట్టి.. ఆయన చాలా నిరాడంబరుడని.. అనేకసార్లు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పటికీ ఆయన సైకిల్‌మీదే తిరుగుతాడని రాశారు. అవును. ఆయన వేయించిన రోడ్లమీద సైకిళ్లు కాకపోతే విమానాలు తిరుగుతాయా? వెటకారంగా అన్నాడు మా పాత్రికేయ మిత్రుడొకరు. నిజమే, అది చాలా వెనుకబడిన ప్రాంతం. గిరిజన గూడాలకు అసలు రోడ్లే లేవు. ఈయన ప్రతిపక్ష ఎమ్మెల్యే. నిధులు రాలేదు. ఆయన ప్రాతినిథ్యం వహించినంత కాలం ఆ నియోజకవర్గ పరిస్థితి అలాగే ఉండేది. తెలంగాణ వచ్చి మరో ఎమ్మెల్యే గెలిచిన తర్వాతే పరిస్థితిలో మార్పు ప్రారంభమైంది. ఇది మన దేశ రాజకీయంలో క్షేత్రస్థాయి వాస్తవికత.

వినేవాడుంటే చెప్పేవాడు.. చదివేవాడుంటే రాసేవాడు చెలరేగిపోతారని తన సంపాదకీయంలో చాలాచాలా గొప్పగొప్ప పదాలు బోధనలు చేసుకున్నాడు. నైతిక విలువలట. సిద్ధాంతాలు లేకుండా పార్టీలు మారుతున్నారట. ప్రజాతంత్ర విలువలకు పాతర వేస్తున్నారట. అటు తిప్పి ఇటు తిప్పి తెలంగాణ పరిణామాల మీదే ఏడుపంతా. నీతులు విలువలు బోధించడానికి బాగుంటాయి. తాము పాటించకపోయినా చదివేవాళ్లకు కూడా బాగానే అనిపిస్తాయి. ఎటొచ్చీ ప్రశ్న ఏమిటంటే క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటి? దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలుకు ఉన్న సన్నద్ధత ఎంత? ప్రజల స్థాయి.. నాయకుల స్థాయి ఎంత ఏమిటి అనేది. సదరు పాత్రికేయ పతివ్రతకు ఒక ప్రశ్న. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ .. ఈ పార్టీల సిద్ధాంతాలేమిటి? ఫిలాసఫీ ఏమిటి? ఈ పార్టీల సిద్ధాంతాల మధ్య ఏమన్నా వైరుధ్యాలున్నాయా? బీజేపీ వాళ్లు పొద్దున్నే లేచి కాషాయ ధ్వజారోహణం చేసి ప్రణామ్ చేస్తున్నారా? కాంగ్రెస్ వాళ్లు గాంధీ పటానికి కొబ్బరికాయ కొట్టి రాట్నం వడుకుతున్నారా? టీడీపీ వాళ్లు రోజూ ఎన్టీఆర్ సమాధి చుట్టూ పొర్లు దండాలేమన్నా పెడుతున్నారా? ఆర్థిక విధానంలో గానీ.. పారిశ్రామిక విధానంలోగాని, బహుళజాతి సంస్థల విషయంలోగానీ.. వ్యవసాయ విధానంలోగానీ.. ఈ పార్టీల మధ్య వైవిధ్యం, వైరుధ్యం ఏమన్నా ఉన్నదా? టీఆర్‌ఎస్ తెలంగాణ పునర్నిర్మాణం నినాదంతో 2014లో అధికారంలోకి వచ్చింది. గత ఐదేండ్లలో రాష్ట్రంలో పాలన అందించింది. అది ఎంత జనరంజకంగా ఉందో మూడునెలల క్రితం ప్రజలే తీర్పు చెప్పారు. పునర్నిర్మాణం కొనసాగాలని ఆకాంక్షించారు. ఆ దిశగా 88 మంది ఎమ్మెల్యేలు కృషి జరుపుతున్నారు. ఆ కృషికి మరో పదిమంది తోడవుతున్నారు. తప్పేమిటి? ప్రతిపక్షంలో ఉండి ప్రాజెక్టుల మీద కేసులు పెట్ట డం.. వీధుల్లో వీరంగాలు సృష్టించడం మాత్రం తెలంగాణకు అభిలషనీయమా? నిజంగా ప్రతిపక్షాలు అలాంటి నిర్మాణాత్మక పాత్ర వహిస్తున్నాయా?

తెలంగాణ రాగానే టీడీపీకి ఇక్కడ భవిష్యత్తు లేదని తేలిపోయింది. అందుకే స్వల్ప వ్యవధిలోనే ఆ పార్టీ నాయకులు ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. ఐదేండ్లుగా రాజకీయ పోరాటాలు చేసినా రాష్ట్రంలో పార్టీ ఏ మాత్రం పుంజుకోలేదు. మరోవైపు కేంద్రంలో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న గురి కుదరడం లేదు. ఇంకోవైపు రేపు రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వగల నాయకత్వం రాష్ట్రంలోగాని కేంద్రంలోగానీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ఒక మునిగే నావ. కూలడానికి సిద్ధంగా ఉన్న శిథిలగృహం.

ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు. పార్టీలను మింగేస్తున్నారనే వాదన పసలేనిది. వాస్తవానికి దేశరాజకీయాల్లో ఇదేం కొత్త పరిణామం కూడా కాదు. స్వాతంత్య్రానంతరం అరవయ్యో దశకంలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయి సీనియర్లంతా ఓల్డ్ కాంగ్రెస్ పేరుతో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఆర్ పేరుతో ఎన్నికల్లో తలపడ్డారు. గరీబీ హఠావో నినాదంతో ఇందిర ఘన విజయం సాధించింది. అనతి కాలంలోనే ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతాకట్టగట్టుకొని ఇందిర పార్టీలో చేరిపోగా ఆ పార్టీ అదృశ్యమైపోయిం ది. ఎమర్జెన్సీ అనంతరం జనతాపార్టీ ఆవిర్భవించి ఇందిరను ఓడించి కేంద్రంతో పాటు అనేకరాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చింది. 78 నాటికి రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్‌లు ఏర్పడ్డాయి. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలో ఇందిరాకాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్రంలో జనతా ప్రభుత్వం కూప్పుకూలిపోగా అక్కడ కూడా ఇందిర అధికారం చేపట్టింది. ఆ వెనుకే రెడ్డి కాంగ్రెస్ నాయకులంతా తీర్మానాలు చేసుకొని ఇందిరా కాంగ్రెస్ ఐలో చేరిపోయారు. వివిధ రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న జనతా ప్రభుత్వాలన్నీ రాత్రికి రాత్రి లేబుల్ మార్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాలుగా మారిపోయాయి. రెడ్డి కాంగ్రెస్ జనతా పార్టీలు కనుమరుగయ్యాయి. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 71 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ గుండెచీల్చి తెలంగాణ ఆకాంక్షను 12 మంది టీపీఎస్ ఎంపీలను గెలిపించి చాటారు. అనతికాలంలోనే కాంగ్రెస్ వారిని మూకుమ్మడిగా పార్టీలో కలిపేసుకుంది. టీపీఎస్ అదృశ్యమైంది. తర్వాత టీడీపీ అధికారం చేపట్టగా ఆ పార్టీ కూడా ఓసారి ప్రజాస్వామ్య తెలుగుదేశం పేరుతో మరోసారి ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో చీలిపోయింది. ఆ పార్టీలవారు ఇతర పార్టీల్లో చేరిపోగా అవీ కనుమరుగయ్యాయి. ఈ పరిణామాల వెనుక.. ప్రజాస్వామ్యమని పార్టీ ఫిరాయింపులనీ సమయానుకూలంగా వాదనలు చేసేవారు ఎప్పుడూ ఉంటారు. ఇదేమంత అసహజ పరిణామాలు కాదు. ఓల్డ్ కాంగ్రెస్ అయినా జనతా అయినా ఎన్టీఆర్ టీడీపీ అయినా.. ఆ పార్టీలకు భవిష్యత్తు లేదని లేదా సమర్థ నాయకత్వం లేదని లేదా ప్రజల ఆమోదం ఏమాత్రం లభించడం లేదని తేలిపోయినందునే అందులో ఉన్న నాయకులు తమదారి తాము చూసుకున్నారు. మునిగే నావ లాంటి పార్టీ పడవల్లో ప్రయాణించాలని ఏ నాయకుడూ కోరుకోడు. ఎప్పుడైతే ఓల్డ్ కాంగ్రెస్ పని అయిపోయిందని భావించారో, ఎప్పుడైతే జనతాపార్టీ కుప్పగూలిందని నిర్ధారించుకున్నారో అప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సురక్షితమైన మరో పడవను వెతుక్కున్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితిని ఈ నేపథ్యంలోనే చూడాలి. తెలంగాణ రాగానే టీడీపీకి ఇక్కడ భవిష్యత్తు లేదని తేలిపోయింది. అందుకే స్వల్ప వ్యవధిలోనే ఆ పార్టీ నాయకులు ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. ఐదేండ్లుగా రాజకీయ పోరాటాలు చేసి నా రాష్ట్రంలో పార్టీ ఏమాత్రం పుంజుకోలేదు. మరోవైపు కేంద్రంలో రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న గురి కుదరడం లేదు. ఇంకోవైపు రేపు రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వగల నాయకత్వం రాష్ట్రంలోగాని కేంద్రంలోగానీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ఒక మునిగే నావ. కూలడానికి సిద్ధంగా ఉన్న శిథిలగృహం. టీఆర్‌ఎస్ 2014లో ఉద్యమ నేపథ్యంతో గెలిచిందని , త్వరలో ఆ ప్రభా వం పోయి తర్వాత ఎన్నికల నాటికి ఇన్‌కంబెన్సీ ప్రభావంతో తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు భావించారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన ఘనవిజయం.. ఆ పార్టీ గెలుపు ఏదో గాలి వాటు కాదని, కేసీఆర్ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారని తేలిపోయింది. పార్టీని నిలబెట్టి విజయతీరాలకు చేర్చగల సమర్థత ఉన్న నాయకుడు రాష్ట్ర పార్టీలో లేకపోవడం.. పోనీ కేంద్రంలో అధికారంతోనైనా సంతృప్తి పడదామంటే అక్కడ ఇంతకన్నా నిరాశాపూరిత వాతావరణం ఉండటంతో సహజంగానే ఆ పార్టీ నాయకుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. దాని ఫలితమే ఈ చేరికలు. అయినా ప్రభుత్వాలు అస్థిరమైనపుడో అధినాయకులను గద్దెదింపే కుట్రలు కొనసాగినపుడో.. ఆయారామ్ గయారామ్ రాజకీయాల్లో బేరసారాలు కొనుగోళ్లు జరిగినపుడు వాటిని ఫిరాయింపులని అనడంలో అర్థం ఉంది. కానీ ప్రభుత్వం సుదృఢంగా సురక్షితంగా ఉన్న సమయం లో జరుగుతున్న మూకుమ్మడి చేరికలను ఫిరాయింపులనడమేమిటి? ఇక్కడ ప్రజాస్వామ్యహననాలు ,ప్రభుత్వాలు మార్చే కుట్రలు లేవు. ప్రజలిచ్చిన తీర్పు తలకిందులు కావడం లేదు. కాంగ్రెస్ నాయకులు కూలిపోతున్న భవనంలోంచి సురక్షిత గూడుకిందికి మారుతున్నారు. అధికారంలో ఉండటానికి, ప్రతిపక్షంలో ఉండటానికి మధ్య ఉన్న తేడా.. దానికారణంగా సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండే తేడా.. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా ఆ పార్టీ నాయకులకు బాగా తెలుసు. ఈ విషయం ఈ పాత్రికేయ పతవ్రతలకూ తెలుసు. పాపం వాళ్ల బాధ ఏమిటంటే.. కేసీఆర్ బలపడుతున్నాడు. టీఆర్‌ఎస్ స్థిరపడుతున్నది. ఎన్ని వార్తలు వడ్డించి ఎంతగా పైకి లేపినా ప్రతిపక్షం కేసీఆర్‌ను ఎదుర్కోగల పరిస్థితి కనుచూపుమేరలో కానరావడం లేదు. అందుకే పచ్చమీడియాకు నిద్రలేమి పట్టుకుంది. అయితే ఎవరెన్ని ప్రచారాలు చేసినా బురద చల్లినా అంతిమ నిర్ణేతలు ప్రజలే.

Related posts

Leave a Comment