కళారూపాలతో… సిపిఎం,జనసేన విస్తృత ప్రచారం..!!

 న్యూస్ ఇండియా 24/7నేషనల్ న్యూస్ నెట్వర్క్...సిపిఎం రంపచోడవరం నియోజకవర్గ అభ్యర్థి సున్నం రాజయ్యను గెలిపించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి మండల్లాలో సిపిఎం సాంస్కృతిక విభాగం ఆధ్వర్యాన కళాకారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక సిపిఎం కార్యాలయం నుంచి జూనియర్‌ కళాశాల, బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌ వరకు డప్పుల దరువు, డ్యాన్సులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ సెంటర్లో ‘సిపిఎం అడుగు పోరాటాల మడుగు’ అంటూ దేవేంద్ర రచించిన గీతానికి కళాకారుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ, జనసేన, బిఎస్‌పి కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో సిపిఐ, సిపిఎం, జనసేన, బిఎస్‌పి బలపర్చిన అభ్యర్థి సున్నం రాజయ్య మూడు సార్లు భద్రాచలం ఎంఎల్‌ఎగా పని చేసినట్లు తెలిపారు. ఆదివాసీల కోసం నిరంతరం పని చేసే నాయకుడు సున్నం రాజయ్య అని అన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపిలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని అన్నారు.

Related posts

Leave a Comment