వాక్సిన్ వికటించి చిన్నారులకు అస్వస్థత.. ఒకరు మృతి

హైద్రాబాద్‌లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో కలకలం రేగింది, చిన్నారులకు వేసిన వ్యాక్సిన్ వికటించడంతో 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌ లో నెలన్నర, రెండు మాసాల వయసున్న 90 మంది చిన్నారులకు వాక్సిన్ ఇచ్చారు. అయితే అందులో 15 మంది చిన్నారులు వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం వారిని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు నిలోఫర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వాక్సిన్ తీసుకున్నవారిలో ఫైజాన్ అనే రెండు నెలల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై నిలోఫర్ ఆసుపత్రిలో మృతిచెందాడు.మరికొందరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నిలోఫర్ ఆస్పత్రికి బాధిత కుటుంబ సభ్యులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Related posts

Leave a Comment