ఏపి టిడిపి వెబ్ సైట్ షట్ డౌన్!

న్యూస్ ఇండియా 24/7న్యూస్ నెట్వర్క్….ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ ‘www.telugudesam.org’ ఆగిపోయింది. వెబ్ సైట్ వ్యవహారాలను నిలిపివేశారు. ఇందుకు కారణాలు తెలియరానప్పటికీ, వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వారికి, ఇది క్లౌడ్ ఫేర్ నెట్ వర్క్ పై ఉందని, ప్రస్తుతం అది పనిచేయడం లేదన్న సమాచారం కనిపిస్తోంది. కాసేపటి తరువాత తిరిగి ప్రయత్నించాలని చూపిస్తోంది. కాగా, సేవామిత్రలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ వెబ్ సైట్ ద్వారానే టీడీపీ నిర్వహిస్తోంది. డేటా చోరీ, ఐటీ గ్రిడ్స్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్న సమయంలో సేవామిత్రల సమాచారం బహిర్గతం కాకుండా చూసేందుకు ముందు జాగ్రత్తగానే టీడీపీ ఈ వెబ్ సైట్ ను మూసేసినట్టు తెలుస్తోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Related posts

Leave a Comment