శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ముహుర్తం ఖారారు!

న్యూస్ ఇండియా భక్తి 24/7 న్యూస్ నెట్వర్క్…భద్రాద్రి: ప్రముఖ పుణ్యకేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఆలయ వేద పండితులు, ఆర్చకులు ముహుర్తం ఖరారు చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీ నుండి 20 వరకు శ్రీ రామ నవిమి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 14న సీతారాముల కల్యాణం, 15న మహ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణం భక్తులు తిలకించేందుకు మిథిలా ప్రాంగణంలో సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రూ.5 వేలు, రూ.2 వేలతోపాటు ఇతర టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించే భక్తులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

Related posts

Leave a Comment