వైసీపిలో చేరిన సిని నటి, మాజి ఎమ్మెల్యే జయసుధ

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్.. ముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్ నివాసంలో ఆమె గురువారం సాయంత్రం భేటి అయ్యారు.వైసీపి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ జయసుధకు కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమే మీడియాతో మాట్లాడుతూ… నేను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కారణం అన్నారు.. వైఎస్సార్ సీపీలోకి రావడం తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు.

అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటానని. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని . పార్టీలో ఉండి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు, కాగా ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదని ఆమే స్పష్టం చేశారు. అప్పట్లో ఎంతోమంది ఎన్నికల్లో పోటీ ఉన్నా సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా నన్ను వైఎస్సార్‌ నిలబెట్టారని. పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు..ఈ సంధర్భంగా వైస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

కాగా జయసుధ 2009 ఎన్నికలలో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అకాల మరణం అనంతరం ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. జయసుధ ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.

Related posts

Leave a Comment