కెసిఆర్ ఖబర్దార్… చంద్రబాబు వార్నింగ్..!!

న్యూస్ ఇండియా 24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల సమాచారాన్ని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థ నిర్వహిస్తుంటే, దాన్ని తస్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ‘ఐటీ గ్రిడ్స్’ సంస్థ ఏపీలోని ప్రజల డేటాను బహిర్గతం చేస్తోందన్న ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దాడులు చేయగా, దీనిపై స్పందించిన చంద్రబాబు, కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమకు సేవ చేసే కంపెనీని లక్ష్యంగా చేసుకుని దాడులు ఎలా చేస్తారని ప్రశ్నించిన ఆయన, ఈ విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తున్నామని అన్నారు. తానిస్తున్న మర్యాదను కేసీఆర్ తప్పితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.

“మాకు సేవ చేసే కంపెనీపై మీ ఏసీబీ పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారా? ఏమనుకున్నారు మీరు? ఇదంత ఈజీగా వదిలిపెట్టను. ఒక పక్క నరేంద్ర మోదీ… దాడులు చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే, ఇంకో పక్క కేసీఆర్ మన ఆస్తులపైన దాడులు చేస్తూ, లేనిపోని నోటీసులు ఇస్తూ, మనల్ని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. ఈ రెండూ కూడా సాగవు. మర్యాదకు మర్యాద… అనవసరంగా మీరు రెచ్చిపోతే… మేము కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకనే ఇదంత ఈజీగా వదిలిపెట్టం. తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరెవరు మా ఆఫీసుకు రావడానికి? ఏ చట్టం కింద వచ్చారు? ఏ రూల్ కింద వచ్చారు? ఏం వయొలేట్ చేశాము మేము? మీకేం సంబంధం?” అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

Related posts

Leave a Comment