పవన్ గెలిస్తే సీఎం అవుతాడు. ఓడితే సీఎంకు మొగుడు అవుతాడు – వర్మ

  న్యూస్ ఇండియా 24/7 పొలిటికల్ న్యూస్ నెట్వర్క్...వర్మ ట్వీట్ … మళ్లీ చంద్రబాబుకే పంచ్ ఇచ్చింది. బాబు శతృవులను అందరిని కలుపుతూ… నారాను నట్టేట ముంచేలానే ఉన్నాడు వర్మ. మొన్న జగన్ తనకు మిత్రుడే అన్నట్లు… లక్ష్మీ స్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డితో జగన్ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన వర్మ… ఇప్పుడు పవనిజం పై నాకు నమ్మకముంది బాబును ముప్ప తిప్పలు పెట్టగలిగే ది పవర్ స్టార్, జనసేనానియే అని బల్ల గుద్ది మరి చెప్తున్నాడు. ఇందుకు కారణం బ్రహ్మం గారే స్వయంగా వచ్చి వర్మ గారి చెవిలో ఆ విషయం చెప్పడం. నిజం వర్మ చెవిలో బ్రహ్మం గారు అన్నారట… ఏపీ లో వచ్చే ఎన్నికల్లో గెలిస్తే పవన్ సీఎం అవుతాడు అని… లేదంటే గెలిచిన సీఎంకు మొగుడు అవుతాడని.

సీ.బీ.ఎన్ , పీ.కేని వాడుకుని అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో … పవన్ తన నైజములో ఉన్న నిజాయితీతో నారా చంద్రబాబు ను ముందుపోటు పొడుస్తాడని … పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

ఒకవేళ పవన్ ఓడాడే అనుకుందాం… ఇక్కడ సీఎం అయ్యే అవకాశం ఇద్దరికి ఉంది. ఒకరు సీఎం చంద్రబాబు… మరొకరు ప్రతిపక్ష నేత జగన్. మరి పవన్ ఎవరికి మొగుడు అని చెప్పాలనుకుంటున్నారో వర్మ … సూటిగా సుత్తి లేకుండా చెబితే బాగుంటుంది కదా అంటున్నారు నెటిజన్లు.

Related posts

Leave a Comment