ఉత్తమ్‌, కేటీఆర్‌ మధ్య ఆసక్తికర సన్నివేశం…!!

 న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్…

నా ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేశావేం…నేనలా చేయగలనా!

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయ్యేందుకు కాంగ్రెస్‌ నాయకులను కలిసేందుకు కేటీఆర్‌ వెళ్లిన సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్కను ఆయన కార్యాలయంలో కలిసి చర్చలు జరిపిన అనంతరం అక్కడికి పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ కూడా వచ్చారు. కేటీఆర్‌ ఎదురు పడగానే ‘ఏంటి…నా ఫోన్‌  నంబర్‌ బ్లాక్‌ చేశావు’ అంటూ ఉత్తమకుమార్‌ ప్రశ్నించడంతో తొలుత ఆశ్చర్యపోయిన కేటీఆర్‌ ‘అయ్యో అదేం మాట…మీ నంబర్‌ని నేను బ్లాక్‌ చేయగలనా’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరు నాయకులు నవ్వుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తాను ఫోన్‌లో ఎక్కువగా మెసేజ్‌లే చూస్తుంటానని, అంతకు మించి ఏమీ చేయనని తెలపడంతో ఇద్దరు నేతలతోపాటు భట్టికూడా నవ్వుకున్నారు.

Related posts

Leave a Comment