అగ్రవర్ణాల రిజర్వేషన్ ను నిలిపివేయండి.. సుప్రీంకోర్టులో మరో పిటిషన్.. !!

న్యూస్ ఇండియా 24/7న్యూస్ నెట్వర్క్...దేశంలోని అగ్రవర్ణాల పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ పై స్టే విధించాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. ప్రముఖ ఉద్యమకారుడు తెహసీన్ పూనావాలా ఈరోజు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రిజర్వేషన్లను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది.

ఈ విషయమై స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ‘జన్‌హిత్ అభియాన్‌’, ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ’ అనే స్వచ్ఛంద సంస్థలు రిజర్వేషన్ కోటాను సవాలుచేస్తూ దాఖలు చేసిన పిటిషన్లతో దీన్ని కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Related posts

Leave a Comment