ఢిల్లీలో భారీ వర్షం: వడగళ్ల వాన

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్(8.45 p.m బులిటిన్)… ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నోయిడా, ఘాజియాబాద్‌లలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఫిబ్రవరి 7 గురువారం మధ్యాహ్నం నుంచి వడగళ్లతో కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. గాలిలోని నీటి ఆవిరి కూడా రికార్డు స్థాయిలో 89 శాతంగా నమోదైంది. 24 గంటల్లో 1మి.మీ వర్షపాతం నమైదైందని మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఈ వర్షాల కారణంగా ఢిల్లీ నగరంలో తిరిగే 16 రైళ్లు 2నుంచి 6 గంటలు ఆలస్యంగా తిరుగుతున్నాయి. వర్షం కారణంగా వాతావరణాన్ని మంచు కప్పేయడంతో దారి కనిపించక రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది.

Related posts

Leave a Comment