నోయిడా ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..

న్యూస్ ఇండియా24/7 న్యూస్ నెట్వర్క్(8.30 p.m బులిటిన్)…న్యూఢిల్లీ: ఢిల్లీలోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్‌ 12లోని మెట్రో ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రోగులను బయటకు తీసుకువస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

Leave a Comment