రూ.15 లక్షల విలువైన గంజాయి పట్టివేత

న్యూస్ ఇండియా24/7 క్రైమ్ న్యూస్ నెట్వర్క్…..(మోతుగూడెం) ఒడిశా నుంచి భద్రాచలం వైపు కారులో తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన వంద కిలోల గంజాయిని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్సై మనోహర్‌జోషి తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశా నుంచి భద్రాచలం పట్టణానికి కారులో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం మోతుగూడెం వెదురు డిపో వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. సీలేరు నుంచి వస్తున్న కారుపై అనుమానం రావడంతో ఆపి పరిశీలించగా అందులో గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఒడిశా రాష్ట్రం రాసబెడ గ్రామానికి చెందిన ముదిలి మంగరాజు, దుప్పిలవాడకు చెందిన వంతల మిసాబ్రాను అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కారును సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు సత్యనారాయణ, శ్రీరామ్‌, వీఆర్వో రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment