మరో కేసులో జగన్ కు క్లీన్ చిట్

న్యూస్ ఇండియా నేషనల్ న్యూస్ నెట్వర్క్…..షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఒక్కో కేసు వీగిపోతోంది. తాజాగా ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపులపై ఉన్న కేసును హై కోర్టు కొట్టేసింది. అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన చాలా కేసుల్లో ఇప్పటికే జగన్ కు క్లీన్ చిట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపుల్లో ఎటువంటి అవినీతి, అక్రమం జరగలేదని రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా హై కోర్టు కేసును కొట్టేసింది.

ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపుల్లో అవినీతి జరిగిందని, అక్రమాలు జరిగాయని ఏసిబి అప్పటి ప్రిన్సిపుల్ కార్యదర్శి ఆదిత్య నాద్ దాస్ పై కేసు నమోదు చేసింది. అదే విధంగా ఇండియా సిమెంట్స్ కు నీటి కేటాయింపుల్లో జగనే ప్రధాన లబ్దిదారని కూడా ఏసిబి వాదిస్తోంది.

అయితే, ఐఏఎస్ అధికారులపై కేసు నమోదు చేయాలన్నా, విచారణ జరపాలన్నా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఏసిబి కానీ ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ కానీ ఎటువంటి అనుమతులు తసుకోకుండానే ఆదిత్య నాధ్ దాస్ పై కేసు నమోదు చేసి విచారణ జరిపింది. హై కోర్టు ఆ విషయాన్ని కూడా తప్పుపట్టింది. అయితే, ఆదిత్య పై కేసు పెట్టటానికి రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు.

కేసుల విచారణకు ప్రభుత్వాలు అనుమతివ్వక పోవటాన్ని, అవినీతి జరగలేదని రాష్ట్రప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయటాన్ని హై కోర్టు ప్రస్తావించినపుడు ఏసిబి ఏమీ సమాధానం చెప్పలేకపోయింది. దాంతో ఆదిత్యనాద్ దాస్ పై నమోదైన మరో కేసును కూడా కోర్టు కొట్టేసినట్లైంది.

Related posts

Leave a Comment