జేడీఎస్‌లోనూ అసంతృప్తి జ్వాలలు..

 న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్
 బెంగళూరు: 
మంత్రివర్గ విస్తరణ జాప్యం చేస్తుండడంపై జేడీఎస్‌లోనూ అసంతృప్తి పెరుగుతోంది. జేడీఎస్‌ కూటమికి సంబంధించి రెండు స్థానాలు భర్తీ చేసుకోవాల్సి ఉండేది. సంకీర్ణ ప్రభుత్వం ఆరంభమైనప్పటి నుంచి ఒక స్థానం ఖాళీగా ఉండగా బీఎస్పీ మద్దతు ఉన్నందున ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మహేశ్‌ కొన్ని రోజులపాటు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగి రాజీనామా చేశారు. దీంతో జేడీఎస్‌ కోటాలో 2 ఖాళీలు ఉన్నాయి. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ 6 మందికి కేబినెట్‌లో చోటు కల్పించింది. కానీ జేడీఎస్‌ మాత్రం వాయిదా వేస్తుండడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో భర్తీ చేయకుండా జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడుతున్నారు. అయితే అసంతృప్తి మరింత దారి తప్పకముందే అప్రమత్తమైతే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు బీజేపీ అవిశ్వాసం పెట్టాలనే తరుణంలో జాప్యం సరికాదని జేడీఎస్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Related posts

Leave a Comment