ఎక్కడ వున్నాం…ఇది ఆంధ్రానా లేదా బీహార్ రా..!!

న్యూస్ ఇండియా 24/7 న్యూస్ నెట్వర్క్….

*మత్తులో జోగుతున్నఉపాధ్యాయులు

*గిరిజన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు లేవు

*గిరిజన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా ఉపాధ్యాయులు
*భవిష్యత్ కార్యాచరణ… ముఖ్యమంత్రే నిర్ణయించాలి
*వీరికి ప్రభుత్వం లేదా… వీరే ప్రభువుల, 

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలానికి చెందిన ఇసుక పట్ల గ్రామం పాఠశాలల దుస్థితిని చూస్తే ప్రభుత్వ పనితీరుకి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే నినాదంతో లక్షలాది రూపాయలను జీతభత్యాలు వెచ్చిస్తూ క్వాలిటీ గల విద్యను అందించాలనే ఉద్దేశంతో గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులను భావితరాల పౌరులుగా తీర్చిదిద్దాలి అనే ఎంతో దృఢసంకల్పంతో పనిచేస్తుంది.కానీ తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ పరిధిలో కొన్ని గ్రామాల్లో… ఉదాహరణకు ఇసుక పట్ల గ్రామానికి చెందిన  ప్రభుత్వ పాఠశాలకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు కంటే  తమ జీతభత్యాలకు ప్రాధాన్యతను ఇస్తూ  ఉపాధ్యాయులు చేసే వెకిలి చేష్టలకు ఇదే నిదర్శనం… తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం చెందిన ఇసుక పట్ల గ్రామ మండల పరిషత్ ప్రాథమిక  పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు సోడే తమన్నాదొర , సోడే బాలు దొర,  అనే ఉపాధ్యాయుల వెకిలి చేష్టలకు పరాకాష్ట , ఈ నెల 9వ తేదీన న్యూస్ ఇండియా బృందం గిరిజన స్థితిగతులు మరియు విద్య  అభివృద్ధి దృష్టి  ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం పరిశీలించడం జరిగింది. ఇసుక పట్ల గ్రామాని చెందిన పాఠశాల ఉపాధ్యాయులు తమన్నాదొర, సోడే బాలు దొర,యొక్క దుస్థితిని చూసి న్యూస్ ఇండియా బృందం ముక్కున వేలేసుకుంది, మత్తుపదార్థాలకు బానిసలై  విద్యార్థుల యొక్క భవిష్యత్తును తుంగలో తొక్కి మత్తులో జోగుతున్నారు. ఇదే గ్రామంలో ఆనవాయితీ ప్రకారం కొన్నిపండుగలు జరుగుతూ ఉంటాయి.కానీ ప్రభుత్వం అధికారికంగా సెలవులను ప్రకటించలేదు, కానీ  మన ఉపాధ్యాయుల మాత్రం వారికి వారే సెలవులు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును తుంగలో తొక్కి తాటికల్లుకు  బానిసై  విద్యార్థులతో చెలగాటమాడుతూ వారి బంగారు భవిష్యత్తును గంగలోకలిపి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నరు. గిరిజన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు లేక విచ్చలవిడితనం పెరిగిందని గ్రామస్థులు వాపోతున్నారు ఊరు పెద్దలు ఈ విషయమే మందలిస్తే మా భార్యలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు,  మీరు తీసుకునే  చర్యలకు  నేను  సిద్ధం మా దగ్గర డబ్బు ఉంది మేము ఏదైనా చేయగలం, అవసరమైతే లక్షలాది రూపాయలను పై అధికారులకు ఇచ్చి మా ఉద్యోగాన్ని కాపాడుకోగలను అని బహిరంగంగా చెబుతున్నారు మరో ఉపాధ్యాయుడు” సోడే బాలు దొర”వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ కమిషన్ వేసి చర్యలు తీసుకోవాలని గిరిజనులు , గిరిజన యువత కోరుతుంది …  దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన అభివృద్ధి కొరకు లక్షలాది రూపాయలను వెచ్చిస్తూ.. ఇక్కడ పరిపాలనాధికారిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ నియమించి కోట్లాది రూపాయలను గిరిజనుల అభివృద్ధికి  ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణంలో… ప్రభుత్వంపై ప్రజలు ఏవిధంగా 2019లో ఓటుతో తమ మద్దతును తెలియజేస్తారు అది చంద్రబాబు నాయుడికి ఎరుక. బాబు తీసుకునే చర్యల ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Related posts

Leave a Comment