కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలి- సీఎం చంద్రబాబు

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్…. దేశవ్యాప్తంగా మళ్లీ రిజర్వేషన్ల అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా రాష్ర్టాలు వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపాయి. తాజాగా సీఎం చంద్రబాబు కూడా వాల్మీకులను ఎస్టీల్లో, కాపులను బీసీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, వాళ్లందరికీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తున్నందువల్లే అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. వాల్మీకులు చేతి వృత్తులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల కోసం రూ.100 కోట్లు కేటాయించి ఆ నిధులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. మంగళవారం సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

Leave a Comment