ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి

న్యూస్ ఇండియా క్రైమ్24/7 న్యూస్ నెట్వర్క్.. మద్యం మత్తులో కారును నడిపి, ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఓ మహిళ మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకీలో నివాసముండే మహ్మద్ ఇక్రమ్ అలీ ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగం మానేశాడు. బార్కాస్ లో జరిగిన పార్టీలో స్నేహితులతో కలిసి పీకలదాకా మద్యం తాగాడు. మద్యం మత్తులో ఇంటికి బయలు దేరాడు. దారితప్పి గచ్చిబౌలీ, గౌలిదొడ్డి మీదుగా అతివేగంగా గొపన్ పల్లి వైపు వెళ్లాడు. గౌలిదొడ్డిలోని ప్రభుత్వ పాఠశాల వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా సమీపంలోని ఇంట్లోకి దూసుకెళ్లింది. గోడలు పూర్తిగా ధ్వంసం కావడంతో ఇంట్లోని మధుబాయ్ అనే మహిళ తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడు ఇక్రమ్ అలీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్ధానికులు. మృతురాలు మధుబాయ్ కి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈమె భర్త సత్వజీ 8 ఏళ్ల కిందట అనారోగ్యంతో మరణించడంతో అప్పటినుంచి ప్రైవేటు సంస్థలో హౌస్‌కీపింగ్‌ పనిచేస్తూ మాధుబై ఒక్కరే కుటుంబాన్ని పోషిస్తున్నారు.

Related posts

Leave a Comment