న్యూస్ ఇండియా24/7 నేషనల్ న్యూస్ నెట్వర్క్….
– నిందితులను గుర్తించటానికి ఫొటో డీఎన్ఏ వాడండి: సీబీఐ
– కోట్లమంది వ్యక్తిగత గోప్యతకు భంగకరం: న్యాయ నిపుణులు
– ఈయూ దేశాల్లో ఫోటో డీఎన్ఏపై నిషేధం
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యక్తిగత కంప్యూటర్లపై నిఘా వేసే అధికారాన్ని మోడీ సర్కారు కట్టబెట్టడంతో పౌరుల గోప్యత హక్కుపై, నిఘా వేసే అధికా రాలపై దేశంలో ప్రస్తుతం చర్చ వేడిగా జరుగుతున్నది. ఈ తరుణంలో సీబీఐ మరో బాంబు పేల్చింది. పలు నేరాల్లో అనుమానితుల్ని గుర్తించేందుకు ఫోటో డీఎన్ఏను వినియోగించాల్సిందిగా సోషల్ మీడియా సంస్థలను సీబీఐ కోరడం వివాదాస్పదంగా మారింది. దీని వాడకంపై పలు న్యాయపరమైన చిక్కులు న్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఫోటో డీఎన్ఏ సాఫ్ట్వేర్ వాడకంపై అంతర్జాతీయంగానూ ఆంక్ష లున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన మైక్రోసాఫ్ట్ కూడా చిన్నారుల పట్ల అస భ్యంగా వ్యవహరించే నేరస్తుల విషయంలో మినహాయించి మిగతా అంశాల్లో దీనిని వినియో గించొద్దంటూ షరతు విధించింది. చిన్నారుల విషయంలో ఉచితంగానే విని యోగించుకునేందుకు మైక్రోసాఫ్ట్ అవ కాశం కల్పించింది.
అసభ్యతతో కూడిన ఫోటోలను నెట్ నుంచి తొలగించడం, నేరాలకు పాల్పడినవారిని గుర్తించడం కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తారు. ప్రస్తుతం యూరోపియన్ దేశాల్లో ఫోటో డీఎన్ఏపై చర్చ జరుగుతోంది. ఫోటో డీఎన్ఏను వినియోగించకుండా ట్విట్టర్,మైక్రోసాఫ్ట్,యూట్యూబ్,ఫేస్‌బుక్‌లాంటి సోషల్ మీడియా కంపెనీలపై ఈయూ దేశాలు నిషేధం విధించాయి. చిన్నారులపై నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం కోసం కోట్లాది ఫోటోలను స్కాన్ చేయడానికి ఆ దేశాల్లో అనుమతి లేదు.
నేరాలతో సంబంధంలేనివారి ఫోటోలను స్కాన్ చేయడం వ్యకిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనని ఆ దేశాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదుల విషయంలోనూ ఫోటో డీఎన్ఏను వినియోగించేందుకు ఆ దేశాల్లో అనుమతి లేదు. నేరస్మృతిలోని సెక్షన్ 91 ప్రకారం సోషల్ మీడియా సంస్థలకు సీబీఐ ఈ నెలలో ఓ నోటీస్ జారీ చేసింది. కొన్ని ఫోటోలను జత చేసి ఫోటో డీఎన్ఏ ద్వారా స్కానింగ్ చేయాలని కోరింది.
తమ దర్యాప్తులో భాగంగా అనుమానితులను గుర్తించడం అత్యవసరమైనందున స్కానింగ్ చేయాలంటూ ఆ సంస్థలను కోరింది. ఈ ప్రక్రియ కోసం నేరాలతో సంబంధంలేనివారి ఫోటోలను కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది పౌరుల ప్రాథమిక హక్కయిన ప్రయివసీని ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రయివసీని ప్రాథమిక హక్కుగా తేల్చి చెబుతూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటూ సీబీఐ అధికార ప్రతినిధిని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కోరగా నిరాకరించారు. చిన్నారుల పట్ల అసభ్యతకు సంబంధించిన కేసుల్లో మినహాయించి సాధారణ నేరాలకు ఈ సాంకేతికతను వినియోగించుకోవడమంటే ఉద్దేశించిన ప్రయోజనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపార్గుప్తా స్పష్టం చేశారు.