ఐపిఎల్‌కు కోనసీమ కుర్రాడు…

న్యూస్ ఇండియా పొలిటికల్ న్యూస్ నెట్వర్క్….ఐపిఎల్‌ -2019కు రాజోలు మండలానికి చెందిన ఆంధ్రా క్రికెటర్‌ బండారు అయ్యప్ప ఎంపికయ్యాడు. ఢిల్లీ జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించనున్నాడు. అయ్యప్ప అండర్‌-19లో తన సత్తాచాటి అందరి అభినందలు అందుకున్నాడు. తెలుగువారి ఘనతను ఇతర రాష్ట్రాల్లో చాటి చెబుతున్నాడు. మంగళవారం జరిగిన ఐపిఎల్‌ వేలంలో అయ్యప్పను ఢిల్లీ జట్టు రూ.20 లక్షలకు పాడుకుంది. ఐపిఎల్‌ సీజన్‌-2019లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ పేరును మార్చి ఢిల్లీ క్యాపిటల్స్‌గా చేశామని జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఐపిఎల్‌ తొలి సీజన్‌ 2008 నుంచి వరుసగా ఆడుతూ వచ్చిన ఢిల్లీ ఇప్పటివరకు ఒక టైటిల్‌ కూడా గెలవలేదు. కనీసం ఫైనల్‌ వరకు కూడా వెళ్లలేదు. 2018 సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు కేవలం నాలుగు విజయాలనే అందుకొని ఏకంగా 9 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌ మధ్యలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్‌ గంభీర్‌ అనూహ్యంగా తప్పుకోవడంతో అతని స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించారు. 2019 సీజన్‌లో బలమైన జట్టుతో ఢిల్లీ బరిలోకి దిగనుంది. సన్‌రైజర్స్‌ స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ను తమ జట్టులోకి బదిలీ చేసుకుంది.

ఢిల్లీ జట్టు ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్‌ కొనసాగుతున్నాడని ఫ్రాంచైజీ తెలిపింది. సహాయక కోచ్‌లుగా మహ్మద్‌ కైఫ్‌, ప్రవీణ్‌ ఆమ్రేలు నియమితులయ్యారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఢిల్లీ ఐపిఎల్‌ జట్లులో కోనసీమ కుర్రాడు చోటు సంపాదించుకోవడాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Related posts

Leave a Comment