నీటి పారుదలపై కేసీఆర్ సమీక్ష: కనిపించని హరీష్ రావు

 న్యూస్ ఇండియా 24/7న్యూస్ నెట్వర్క్... హైదరాబాద్‌: నీటి పారుదలపై ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కనిపించలేదు. గత మంత్రివర్గంలో హరీష్ రావు నీటి పారుదల శాఖను నిర్వహించిన విషయం తెలిసిందే. పలు నీటి పారుదల ప్రాజెక్టుల పనులు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ వచ్చాయి.

కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. హరీష్ రావు నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పడిన శ్రమను కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రశంసించారు కూడా.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష నిర్వహించబోతున్నట్లు ఆయన కార్యాలయం శుక్రవారమే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే కేసీఆర్‌ తన క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో శనివారం సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు ఏడు గంటలపాటు సమీక్ష జరిపారు.

తన తనయుడు కేటీ రామారావుకు కేసిఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి హరీష్ రావును పూర్తిగా పక్కకు పెట్టినట్లు భావిస్తున్నారు. హరీష్ రావు స్థానంలో నీటి పారుదల శాఖను బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Related posts

Leave a Comment