భారీ పోలింగ్‌ ఎవరికి లాభం..?

న్యూస్ ఇండియా…  బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి  భారీగా పోలింగ్‌ నమోదు కావడంతో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గంలో 73.88 శాతం పోలింగ్‌ జరగ్గా, ఈసారి ఏకంగా 83.10 శాతం  పోలింగ్‌ జరిగి రికార్డు సృష్టించింది. గతంతో పోల్చితే 9.22 శాతం పోలింగ్‌ అధికంగా జరిగింది. అంత భారీగా పోలింగ్‌ నమోదు కావడంతో అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. భారీ పోలింగ్‌  టీఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందా లేదా ప్రధాన ప్రత్యర్థి బీఎస్‌పీకి దోహద పడుతుందా, ఇతర అభ్యర్థులకు ఏమైనా లబ్ధి జరుగుతుందా అనేది రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఓటర్లు  పోటెత్తడంతో అభ్యర్థుల  గెలుపు ,ఓటములపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఊహించని విధంగా ఓట్లు పోలవ్వడంతో ఓటరు నాడి ఏందనేది అంతుచిక్కడం లేదు. పోలింగ్‌కు పోటెత్తిన ఓటర్లు చివరికి ఎవరి పక్షం నిలిచారనేది తెలుసుకోవడానికి కష్టతరంగా మారింది.

బరిలో 13 మంది..పోటీ ఇద్దరి మధ్యే
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఈ సారి  13 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో పోటీమాత్రం ఇరువురు అభ్యర్థుల మధ్యనే హోరాహోరిగా సాగి నట్లు స్పష్టమైంది. ఇరువురు అభ్యర్థులు గెలుపే ప్రధాన లక్ష్యంగా చివరి వరకు తీవ్రంగా శ్రమించా రు. ఈ తీరుగా  పోలింగ్‌ కూడా అంచనాలకు మిం చి జరగడంతో అభ్యర్థుల్లో ప్రస్తుతం ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏకపక్షమా….వ్యతిరేకమా ?
భారీగా పోలింగ్‌ జరగడంతో విశ్లేషకులకు కూడా ఓటర్లు ఎటువైపు మొగ్గారో అర్ధంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం బెల్లంపల్లితో పాటు తాండూర్‌ ,కాసిపేట ,నెన్నె ల, వేమనపల్లి ,కన్నెపల్లి , భీమిని ,బెల్లంపల్లి గ్రామీణ ప్రాంతాల్లో ఊహించని విధంగా పోలింగ్‌ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలిం గ్‌ జరగడం వల్ల ఆ ఓట్లు అధికార పక్షమైన టీఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందా లేదా ప్రత్యర్థి పక్షమైన బీఎస్‌పీకి లబ్ధి చేకూరుస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇరువురు అభ్యర్థులు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓట్లు అధికంగా పోలయ్యాయి.

Related posts

Leave a Comment