మహాకూటమికి వ్యతిరేకంగా వైసీపి ప్రచారం..! గులాబీ పార్టీకి మద్దత్తిస్తున్న జగన్..!

న్యూస్ ఇండియా పొలిటికల్ డెస్క్….హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రం నేతలు కూడా తెలంగాణ ఎన్నికల్లో తమ ప్రభావం చూపాలని తాపత్రయ పడుతున్నారు. తెలంగాణలో తెలంగుదేశం పార్టీ క్యాడర్ ఉందని, అందుకే ఆ పార్టీ గెలుపుకోసం నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాని ఎటువంటి పార్టీ ఉనికి లేని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో తన ప్రాభల్యాన్ని చాటుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణలోని కొన్ని నియోజక వర్గాల్లో వైసీపి నేతలు పర్యటించి మహాకూటమికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో మహా కూటమి ఓడిపోతే ఆంద్రాలో జగన్ కు ఆటోమేటిక్ గా నైతిక స్థైర్యం వస్తుందనే పాయింట్ ఆధారంగా తెలంగాణ ఎన్నికల్లో జగన్ కూటమికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

కూటమికి వ్యతిరేకంగా ప్రచారం..!! 
తెలంగాణ ఎన్నికల్లో వైసీపి..! కూటమికి వ్యతిరేకంగా ప్రచారం..!!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 13 నెలలుగా ప్రజాసంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం మిగిలిన వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. జగన్ యాత్రకు విరామం దొరికినప్పుడల్లా పార్టీ వ్యవహారాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా, ఏపీలో ప్రతిపక్షంగా ఉంటూనే జగన్ తెలంగాణ రాజకీయాల పట్ల ద్రుష్టి సారించినట్టు తెలుస్తోంది.

జగన్ మాస్టర్ ప్లాన్..!! 
తెలంగాణలో కూటమి ఓడితే ఏపిలో ఎదురుండదు..! జగన్ మాస్టర్ ప్లాన్..!!

ఏపీలో ప్రభుత్వ విధానాలను నిలదీస్తున్నా అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదని వైసీపి భావిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి 2019లో జరిగే ఎన్నికలపై పూర్తి ఫోకస్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ప్రకటించింది.

Related posts

Leave a Comment