మేరా హైదరాబాద్ ! హమారా హైదరాబాద్ !! నినాదంతో సీమాంధ్రుల ఐక్యవేదిక పనిచేస్తుంది… సంగినీడి

.

తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జీవనోపాధి సాగిస్తున్న కోటి మంది సీమాంధ్రుల పరిరక్షణకు ,సీమాంధ్రుల అభ్యున్నతికి ,వారి హక్కుల కోసం  నిరంతరం  సీమాంధ్రుల ఐక్యవేదిక  అండగా నిలుస్తుందని ,మేరా హైదరాబాద్ ! హమారా హైదరాబాద్ !! నినాదంతో సీమాంధ్రుల ఐక్యవేదిక పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు సీమాంధ్రులకు చేరే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు , నానాకరామ్ గూడా భవనం కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి వారికి న్యాయం చేయడం జరిగింది. సీమాంధ్రుల హక్కులను పరిరక్షిస్తామని చెబుతూన్న కొన్ని రాజకీయపార్టీలు, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర , ఆంధ్రోళ్లు అనే వ్యతిరేక భావన సృష్టించబడుతు తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు అనిపిస్తుందని, మేము భారత పౌరులం,తెలుగువాళ్ళం, తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనే భావన మాకు ఎప్పుడూ కలగలేదు.  తెలంగాణ అభివృద్ధికి మా సీమాంధ్రుల పాత్ర ఎంతో ఉందని , తెలంగాణ ప్రజలతో మమేకమై అన్నదమ్ములవలె నివసిస్తున్నామని, వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఈ  వివక్షత చూపించిన దాఖలాలులేవని ,ఆంధ్ర ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తున్నారు… ఎంతవరకు భావ్యం..? ఇకనైనా పులిస్టాప్ పెట్టండి ! లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని’ సీమాంధ్రుల ఐక్య వేదిక అధ్యక్షలు సంగినీడి సీతారాం అన్నారు.

2) రెండు మూడు రోజుల్లో  సీమాంధ్రులు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వాలో భవిష్యత్ కార్యాచరణ  ప్రకటిస్తామని  పత్రికా ప్రతినిధుల ద్వారా తెలియజేస్తున్నాం.

3)  డిసెంబర్ రెండు మూడు తారీకుల్లో  లక్ష మందితో  “సీమాంధ్రుల ఐక్యత గర్జన”  మహాసభ  ఏర్పాటు చేయుటకు , తీర్మానం చేయడం జరిగింది. 

జనసమీకరణకు రంగం సిద్దంచేసుకుంటున్నామని , స్థల పరిశీలన ,సభా వేదిక మరియూ సభాస్థలం పర్మిషన్  కోసం ఒకటి రెండు రోజుల్లో పత్రికా ప్రతినిధులకు పూర్తిస్థాయి సమాచారం అందించగలమని ఈ సందర్భం గా తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో  ప్రధాన కార్యదర్శి  బొర్రా శివరాం ప్రసాద్ చౌదరి,  అల్లూరి ఇందిరా ప్రియదర్శిని, కాసిన రామలింగేశ్వరరావు, కంచర్ల శేషగిరిరావు, ఎం నాగేశ్వరరావు, బందెల నగేష్ కుమార్ ,అన్వర్,  జగన్మోహన్ రెడ్డి,  పొన్నూరి కుమార్ రాఘవేంద్ర, రాష్ట్ర కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు . 

 

 

Related posts

Leave a Comment